తెలుగులో బిగ్ బాస్ షో సీజన్8 నడుస్తున్న విషయం తెలిసిందే.. అయితే బిగ్ బాస్ షోలో అప్పుడప్పుడు ఎవరూ ఊహించని సంఘటనలు జరిగి వీక్షకులను విస్మయానికి గురి చేస్తుంటాయి. అలాంటిదే ఇప్పుడు కూడా చోటు చేసుకుంది. అది మరేంటో కాదు.. కృష్ణ ముకుంద మురారి సీరియల్ తో మాటీవి ప్రేక్షకులను అలరించిన ప్రేరణ. బిగ్ బాస్ షోలో తన మనసులో ఉన్న కోరిక బయటపెట్టి అటు కంటెస్టెంట్ లకు ఇటు బిగ్ బాస్ వీక్షకులకు ఊహించని షాకిచ్చింది. అదేంటంటే ఒక ఎపిసోడ్లో ప్రముఖ హోస్ట్, నిర్మాత ఐన ఓంకార్ గారు గెస్టుగా వచ్చి కంటెస్టెంట్సుకి ఒక టాస్కు పెట్టారు. అందులో ప్రేరణ గెలవటంతో ఆమెని ఒక కోరిక కోరుకోమన్నారు. ప్రేరణ తన పెళ్లి వీడియోని ప్లే చెయ్యల్సిందిగా కోరి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె కోరిన విధంగా బిగ్ బాస్ వీడియో ప్లే చేయటంతో ఆ వీడియో చూస్తూ ప్రేరణ ఎంతో ఎమోషనల్ అయింది. బిగ్ బాస్ షోలో ఒకరి పెళ్లి వీడియో ప్లే చేయటం అనేది ఇదే మొదటిసారి. అసలు ఇలా జరుగుతుందని ప్రేక్షకులు కానీ, కంటెస్టెంట్స్ కానీ ఎవరూ ఊహించి ఉండరు. సీరియల్లో ముకుందగా ఎలాగైతే తన అల్లరితో అందరి మనసులని గెలుచుకుందో, అలాగే ఈ షోలో కూడా ప్రేరణ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఎంత అల్లరి చేసినా కూడా, ఆటల విషయం వచ్చేసరికి సివంగిలా బరిలో దిగి ఆడటం ఆమెని ప్రేక్షకులకి ఇంకా దగ్గర చేసింది.
ప్రేరణకి మొదటినుంచే లాంగ్ జంప్, హై జంప్, వంటి స్పోర్ట్సులో ఆసక్తి ఉండటం, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల అనుభవం కూడా ఉండటంతో, ఈ షోలో పెట్టిన ఫిజికల్ టాస్కుల్లో కూడా తన ప్రయత్నలోపం లేకుండా అబ్బాయిలతో పోటీగా ఫైట్ చేసింది. ఐతే ఈ సీజన్లో వచ్చిన కంటెస్టెంట్సులో ఒకరిగా అడుగుపెట్టిన ప్రేరణ చివరి వారం వరకూ ఉండి, టాప్5 గా నిలవటం, అందులోనూ ఉన్నవారిలో ఒక్కగానొక్క అమ్మాయి కావటం విశేషం. ఈమె మా టీవీలో ఇటీవల పూర్తయిన ‘కిర్రాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్’ అనే గేమ్ షోలో కూడా తమ టీం విన్నింగ్ కోసం కష్టపడి అందరి దృష్టిని ఆకట్టుకుంది. కాలేజీ రోజుల్లో తన మోడలింగ్ కెరీర్ మొదలుపెట్టి కన్నడ సీరియల్ ‘హర హర మహాదేవ్’ లో అవకాశం రావటంతో తన బుల్లి తెర ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత కొన్ని కన్నడ సినిమాలు చేసినా కూడా అంత గుర్తింపు దొరకలేదు. మన తెలుగు బుల్లి తెర పరిశ్రమకి ‘కృష్ణా ముకుంద మురారి’ తో వచ్చి మంచి పేరు తెచ్చుకుంది. ఈమెకి గతంలో కన్నడ బాషలో ఆన్లైన్ మినీ బిగ్ బాస్ షోలో పాల్గొన్న అనుభవం కూడా ఉంది. ఇప్పుడు ఈ తెలుగు బిగ్ బాస్ లో చివరివారం వరకూ నిలిచి తనకంటూ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ప్రేరణ మగాళ్ళకి ధీటుగా నిలబడి ఈ టైటిల్ గెలుస్తుందా..... వేచి చూడాల్సిందే...